బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడు అంటూ మండిపడ్డారు. గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్ గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడు అంటూ ట్వీట్ చేశారు. గాలిమోటర్లో మూటలు మోసుడు కాదు కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడు అంటూ తెలిపారు. ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడంటూ మండిపడ్డారు. నీ కల్లబొల్లిమాటలతో కాలయాపన చేయడం కాదు ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చటేందో చూడు అంటూ నిప్పులు చెరిగారు. నీ మూసి ముసుగులు కాదు కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడు అని ట్విటర్ వేదికగా సీఎం రేవంత్ పై మండిపడ్డారు.
రైతన్నల కన్నీళ్ల వైపు చూడు సీఎం రేవంత్..
