భారీగా పడిపోయిన హైదరాబాద్ ఇళ్ల అమ్మకాలు..

ktr-25.jpg

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇళ్ల అమ్మకాలు పడిపోయాని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం జులై సెప్టెంబ‌ర్ త్రైమాసికం ఇండ్ల అమ్మకాలు దాదాపు 42 శాతం ప‌డిపోయిన‌ట్లు ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ నివేదికను రిలీజ్ చేసింది. ఈ నివేదిక‌ను తన ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు. అభివృద్ధి చెందుతున్న మ‌హాన‌గ‌రం సంక్షోభంలోకి వెళ్తుంద‌న‌డానికి ఈ నివేదిక‌నే నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంస‌క ప‌రిపాల‌న‌ చేస్తున్నారని విమర్శించారు. ఆర్ఆర్ ట్యాక్స్, కూల్చివేత‌ల కార‌ణంగా రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోయింద‌న్నారు. హైదరాబాద్ లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో హైద‌రాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. దేశానికే ఆద‌ర్శంగా నిలిచిన ఈ మహా నగరం ఇవాళ గంద‌ర‌గోళ ప‌రిస్థితుల్లో కూరుకుపోయిందంటూ కేటీఆర్ మండిపడ్డారు.

Share this post

scroll to top