నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. BRS MLC అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోరుతూ ఇవాళ ఉదయం నర్సంపేట పద్మ శాలి ఫంక్షన్ హాల్లో గ్రాడ్యుయేట్స్ సభలో పాల్గొంటారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఆ తర్వాత ములుగు జిల్లా నిర్వహించే కార్యకర్తల సమావేశం లో పాల్గొని..అనంతరం మధ్యాహ్నాం 3:00 గంటలకు నాని గార్డెన్స్ లో వరంగల్ ఈస్ట్ గ్రాడ్యుయేట్స్ తో సభ ఉంటుంది. ఇక ఇవాళ సాయంత్రం 4:00 గంటలకు హంటర్ రోడ్ లోని CSR గార్డెన్ లో వరంగల్ వెస్ట్ నియోజకవర్గం కార్యకర్తల సభలో పాల్గొంటారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.