సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు..

ktr-24.jpg

మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాదిన్నర పాలనలో సీఎం రేవంత్ చేసిన పనులు ఏవైనా ఉన్నాయా అంటే అవి బీఆర్ఎస్ పై నిందలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు చేరవేయడమే తప్పా తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఫైర్ అయ్యారు. ఢిల్లీకి తెలంగాణ ఏటీఎం లాగ మారిపోయిందని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును చేర్చడం తెలంగాణకే ఎంతో అవమానం అని అన్నారు.

గతంలో కేస్ ల తర్వాత ఆయన వైఖరి మారుతుంది అనుకున్నారు.. కానీ మారలేదు. అప్పట్లో ఓటుకు నోటు కుంభకోణం చేస్తే ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా చెప్పారు. డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారు అని చెప్పారు. ఇప్పుడు అదే విషయం స్పష్టం అయింది. బీజేపీకి నిజాయితీ ఉంటే స్పందించాలి అని కోరారు. అమృత్, సివిల్ సప్లై స్కామ్, యంగ్ ఇండియా, హెచ్ సీయూ భూముల విషయంలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని తేల్చింది. 10 వేల కోట్ల విషయంలో స్పెషలైజ్డ్ ఏజెన్సీతో విచారణ జరిపించాలని రిపోర్ట్ ఇచ్చింది.

Share this post

scroll to top