తొలి మహిళా అధ్యక్షురాలు కమలా హారిస్‌పై కేటీఆర్‌ ట్వీట్‌..

ktr-11.jpg

అధ్యక్ష ఎన్నికలతో అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి. డెమోక్రాట్స్‌‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌, కమలా హారిస్‌మొదటిసారి ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. ట్రంప్‌తో జరిగిన ఈ డిబేట్‌లో కమలా దూకుడు ప్రదర్శించారు. ట్రంప్‌ విధానాలను ఎండగట్టారు.

ఈ చర్చలో ట్రంప్‌పై కమలా చేసిన ఎదురుదాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశంసించారు. కమలా హారిస్‌ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి అంటూ కొనియాడారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘కమలా హారిస్‌ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి అనిపించింది. ఈ ఏడాది చివర్లో అమెరికాకు ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి’ అని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

Share this post

scroll to top