ఏపీలో కలకలం చోటు చేసుకుంది. అటెండర్‌ను చెప్పుతో కొట్టింది ఓ లేడీ సీఐ. అటెండర్‌ను సీఐ చెప్పుతో కొట్టిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భాను తన పేరు చెప్పి అక్రమ మద్యం అమ్ముతున్న వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడంటూ అటెండర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకేం తెలియదని అతడు చెబుతున్నా వినిపించుకోలేదు. అనంతపురం ఎక్సైజ్ స్టేషన్‌లో రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా తాజాగా వీడియో బయటకొచ్చింది.
అటెండర్ ను చెప్పుతో కొట్టిన లేడీ సీఐ..
