మద్యం గంజాయికి బానిసలైన కొందరు ఆకతాయిలు..

gang-07.jpg

ఏపీలోని విజయవాడలో యువకులు అడ్డదారులు తొక్కుతున్నారు. మద్యం, గంజాయికి బానిసలైన కొందరు ఆకతాయిలు రోడ్లపై పిచ్చివేశాలు వేస్తూ వచ్చిపోయే వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇక రాత్రి అయ్యిందంటే చాలు జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. గ్యాంగులుగా ఏర్పడి గొడవలు పెట్టుకోవడం, తన్నుకోవడం లాంటివి చేస్తూ సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు.

తాజాగా విజయవాడలోని యనమలకుదురులో గ్యాంగ్ వార్ జరిగింది. పాత గొడవల నేపథ్యంలో కొందరు యువకులు గ్యాంగులుగా ఏర్పడి కొట్టుకున్నారు. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగగా కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది. గత రాత్రి పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద జరిగిన గొడవలో రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు ముకుమ్మడి దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

Share this post

scroll to top