దేవర నుంచి వరుసగా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు మేకర్స్. ఇటీవలే విడుదలైన రెండో సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తూ మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతోంది. మూడో సాంగ్, దేవర ఎంట్రీ సీక్వెన్స్ పై క్రేజీ అప్డేట్స్ బయటకిరాగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రివీల్ చేశారు. దేవర సెట్స్ లో ఆయుధ పూజ జరుగుతోంది అంటూ సినిమాలో వాడే పవర్ ఫుల్ కొడవలి కత్తిని పిక్ ను విడుదల చేశారు మేకర్స్. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ కత్తిని చూస్తేనే అర్ధం అవుతోంది ఎన్టీఆర్ ఊచకోత ఏ రేంజ్ లో ఉండబోతోందో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఆయుధ పూజ సీక్వెన్స్ తోనే తారక్ రెండో పాత్ర ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. ఈ సీన్స్ లో తారక్ కత్తి పట్టుకుని నరుక్కుంటూ వెళ్లే సన్నివేశాలు చాలా వైల్డ్ గా ఉంటాయని తెలుస్తోంది. కొరటాల ఈ ఫైట్స్ తో ప్రేక్షకులకు ఓ విజువల్ వండర్ ను అందించడానికి సిద్ధమైయ్యాడని తెలుస్తోంది. దేవర మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు సిద్ధమైంది.
ఆ సీన్స్ తోనే ‘దేవర’ ఎంట్రీ..
