రాష్ట్రం అప్రజాస్వామికంగా జరుగుతున్న మున్సిపల్ ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైయస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించాలని కోరారు. దాడులు, కిడ్నాప్ లు, అరాచకాలకు తెలుగుదేశం పార్టీ తెగబడుతున్న నేపథ్యంలో ప్రజాస్వామికంగా ఎన్నికలు సాధ్యమని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైయస్ చైర్మన్ ఎన్నికలకు జరుపుతున్న ప్రక్రియ చూస్తుంటే ప్రజాస్వామికవాదులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. ప్రజల ద్వారా ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వైయస్ఆర్ సీపీ కార్పోరేటర్లు, కౌన్సిలర్లను తెలుగుదేశం పార్టీ ప్లాన్ – ఏ కింద ప్రలోభపెడుతున్నారు. వారు స్పందించకపోతే ప్లాన్-బీ కింద భయపెడుతున్నారు. అయినా ఫలితం లేకపోతే ప్లాన్ – సీ కింద దాడులు, కిడ్నాప్ లకు తెగబడ్డారు. నాలుగు సార్లు సీఎంగా అనుభవం ఉందని, నలబై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు ఇదేనా ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ, గౌరవం? తిరుపతి కార్పోరేషన్ లో సైకిల్ గుర్తుపై తెలుగుదేశం పార్టీ తరుఫున గెలిచింది కేవలం ఒక్క కార్పోటర్ మాత్రమే.
మిగిలిన అన్ని స్థానాల్లోనూ ఫ్యాన్ గుర్తుపై వైయస్ఆర్ సీపీ కార్పోరేటర్లు గెలుపోందారు. నిన్నటి వరకు వైయస్ చైర్మన్ పదవి కోసం మా పార్టీకి చెందిన కార్పోరేటర్లను ప్రలోభపెట్టారు, భయపెట్టారు. చివరికి డిప్యూటీ చైర్మన్ పదవికి పోటీ చేస్తున్న శేఖర్ రెడ్డి ఇంటిపై బుల్ డోజర్ తో దాడి చేయించారు. అయినా కూడా వైయస్ఆర్ సీపీ కార్పోరేట్లరు పార్టీపైన, పార్టీ అధినేత వైయస్ జగన్ గారి నాయకత్వంపైన అచంచల విశ్వాసంతో పార్టీకి అనుకూలంగా ఓటు వేసేందుకు వాహనంలో వెడుతుంటే, తిరుపతిలో ఆ వాహనంపై కిరాతకంగా తెలుగుదేశం వారు దాడి చేశారు.