టీడీపీ నేతల దాడులపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకి వైసీపీ నేతలు మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. టీడీపీ రిగ్గింగ్కు పాల్పడిందని వారు ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని దుయ్యబట్టారు. 60కి పైగా కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. దీనిపై అవసరమైతే న్యాయస్థానాలనూ ఆశ్రయిస్తామన్నారు.
ఏపీ సీఈవోకి వైసీపీ నేతల ఫిర్యాదు
