మూసీ వద్ద నిద్రపోగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి స్వీకరించారు. మూసీ వద్దే నిద్రిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో శనివారం బీజేపీ నేతలు మూసీ ప్రాంతాల్లో పర్యటించి అక్కడే బస చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4గంటల నుంచి 17వ తేదీ ఉదయం 9గంటల వరకు మూసీ పరిధిలోని బస్తీవాసులతో మమేకం అవుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని 20 బస్తీల్లో 20 మంది బీజేపీ ముఖ్యనాయకులు బస్తీ నిద్ర చేయనున్నారు. ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, ఎనిమిది జిల్లాలకు సంబంధించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొనున్నారు.