పార్లమెంట్ దిగువ సభ లోక్ సభ కొత్త స్పీకర్ ఎన్నికకు సంబంధించి రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. జూన్ 26న జరగనున్న స్పీకర్ ఎన్నికకు ఒకరోజు ముందు ఈ పదవికి తన అభ్యర్థి పేరును ఎన్డీయే ప్రకటించే అవకాశముంది. అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు బీజేపీ సంప్రదింపులను ముమ్మరం చేసింది. ఎన్డీఏలోని తమ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకుంటోంది. మాజీ స్పీకర్ ఓం బిర్లా మరోసారి స్పీకర్ కాబోతున్నారా? లేదంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి పురంధేశ్వరి స్పీకర్ సీట్లో కూర్చోబోతున్నారా? రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. గతంలో ఎవరూ ఊహించని నేతలను తెరపైకి తెచ్చింది బీజేపీ నాయకత్వం. ఈసారి కూడా బీజేపీ నిర్ణయించే అభ్యర్థికే తమ మద్దతు అని మిత్రపక్షాలు ప్రకటించాయి. వాస్తవానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతుంది.
స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల రేసులో మాజీ స్పీకర్ ఓం బిర్లా, పురంధేశ్వరి..
