మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఉండవల్లి నివాసంలో 16వ రోజు ప్రజాదర్బార్‌కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. పక్షవాతంతో బాధపడుతున్న తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని అనారోగ్యంతో బాధపడుతున్న తమకు ఎలాంటి ఆధారం లేదని, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని చినకాకానికి చెందిన బి.పుట్లమ్మ కోరారు. దివ్యాంగురాలైన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని చినకాకానికి చెందిన గౌసియా బేగం విజ్ఞప్తి చేశారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని మంగళగిరికి చెందిన ఉద్యోగులు కోరారు. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల విక్రయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని యర్రబాలెం, నవులూరు, నిడమర్రు, బేతపూడి, కురగల్లుకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు విజ్ఞప్తి చేశారు.
కష్టాన్ని వింటూ లోకేష్ భరోసా..
