మంత్రిగా నారా లోకేష్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ – 208 చాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. మెగా డీఎస్సీ దస్త్రం పైనే లోకేష్ తొలి సంతకం చేశారు. మెగా డీఎస్సీ ద్వారా 16347 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన ఫైలుపైనే సంబంధిత శాఖ మంత్రిగా లోకేష్ తొలిసంతకం చేశారు.
మెగా డీఎస్సీ ఫైలుపైనే లోకేష్ తొలి సంతకం..
