ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతూనే ఉన్నాయి. తెలంగాణలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. పగలంతా ఎండలు ఉక్కపోత ఉంటే సాయంత్రం నుంచి తెల్లవారాజాము వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాగా నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉందంటోంది వాతావరణ శాఖ.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
