నిన్నటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మంగళవారం దక్షిణ మధ్య బంగాళాఖాతం, సగటు సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వాతావరణ సూచనలు
ఉత్తర కోస్తాంధ్ర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో మంగళ, బుధువారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రాబోయే రెండు రోజులులో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉంది.