మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు అనే సస్పెన్స్ వీడనుంది. మహాయుతి కూటమిలోని బీజేపీకే సీఎం పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా సేవలందిస్తున్న దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోడవం ఖరారయిపోయింది. బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోడీ అమిత్ షా జేపీ నడ్డాలతో ఏక్‌నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ భేటీ కానున్నారు. ఆ తర్వాత సీఎం ప్రకటన, కేబినెట్ కూర్పుపై తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అయితే, మహాయుతి కూటమి గెలుపు కోసం శ్రమించిన శివసేన చీఫ్, ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే డిమాండ్ చేశారు.
మళ్లీ తనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసిన ఏక్ నాథ్ షిండే బుధవారం పట్టు సడలించారు. కొత్త సీఎం ఎంపికపై ప్రధాని మోడీ, బీజేపీ అగ్రనేత అమిత్‌షాల నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. దీంతో దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలో మహాయుతి కూటమి మహారాష్ట్రలో కొలువుతీరనుంది. ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ చీఫ్ అజిత్‌పవార్‌లు ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టబోతున్నట్లు సమాచారం. నవంబర్ 30 లేదా డిసెంబర్ ఒకటో తేదీన సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని అజిత్ పవార్ వెల్లడించారు.