అమరావతి మోడీ సభకు కొద్ది దూరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాన పనులను ప్రారంభించేందుక ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్ పోర్టు ద్వారా వెలగపూడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో నేతలు ప్రసంగిస్తున్నారు. ఈ సమయంలోనే సభా ప్రాంగణానికి మూడు కిలో మీటర్ల దూరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మందడం లోని పోలాల్లో ఉన్న పైపులకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. దీంతో కొద్ది సమయంలోనే మంటలు భారీగా ఎగిసిపడటంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నారు.
అమరావతి మోడీ సభకు కొద్ది దూరంలో భారీ అగ్ని ప్రమాదం..
