పుట్టిన రోజు సందర్బంగా మిరాయ్ నుంచి మనోజ్ పాత్ర గ్లింప్స్ రిలీజ్..

manchu-1-1.jpg

ఇటీవల హనుమాన్ తో భారీ హిట్ కొట్టిన తేజ సజ్జ నెక్స్ట్ మిరాయ్ అనే అద్భుతమైన సినిమాతో రాబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా ప్రకటించాగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం మిరాయ్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.

మిరాయ్ లో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. నేడు మంచు మనోజ్ పుట్టిన రోజు కావడంతో మిరాయ్ సినిమా నుంచి మనోజ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసారు. బ్లాక్ స్వార్డ్ అనే ఓ కత్తి గురించి, అది ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ అని చెప్తూ మంచు మనోజ్ పాత్ర దగ్గర ఆ కత్తి ఉన్నట్టు, దాంతో మనోజ్ యుద్దాలు చేస్తున్నట్టు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో ఈ గ్లింప్స్ చూపించారు. దీంతో మిరాయ్ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మిరాయ్ సినిమా.. కళింగ యుద్ధం తరువాత అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం కోసం జరిగే పోరాట కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఆ గ్రంధాన్ని కాపాడే యోధులలో తేజ సజ్జ ఒకడిగా నటిస్తున్నట్టు సమాచారం.

Share this post

scroll to top