మామిడితో సహా ఈ పండ్ల విత్తనాలు ఆరోగ్యానికి ఓ వరం.. ఎలా ఉపయోగించుకోవాలంటే..

mango-15.jpg

సీజన్ లో దొరికే మామిడి పండ్లు, నేరేడు వంటి వాటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మామిడి పండ్లను తినడమే కాదు.. పచ్చి మామిడికాయలతో రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. మామిడి కాయ చట్నీ, మామిడికాయ పన్నా , మామిడికాయ పప్పు వంటి వాటితో పాటు పండిన మామిడిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. అయితే మామిడి పండ్లను తిని వాటి టెంకలను (విత్తనాలను)  పడేస్తారు. మామిడి పండు మాత్రమే కాకుండా దాని విత్తనం అంటే మామిడి టెంక కూడా చాలా ఉపయోగకరం. మామిడి టెంకతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అయితే ఇలా మామిడి విత్తనం మాత్రమే కాదు ఇంకా రకరకాల పండ్ల విత్తనాలతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

మామిడి టెంకలు:

మామిడి పండు తిన్న తర్వాత దాని టెంకలను కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత టెంకకు ఉన్న పెంకును వేరు చేసి.. దాని లోపల ఉన్న జీడిని తీసి, ఎండబెట్టి పొడిని తయారు చేసుకోవాలి.

నేరేడు పండు గింజలు:

ప్రస్తుతం నేరేడు పండ్ల సీజన్ కొనసాగుతోంది. ఈ పండ్ల రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. నేరేడు పండ్లతో పాటు దీని గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నేరేడు పండ్ల నుంచి విత్తనాలను తీసి వాటిని కడగాలి. ఎండబెట్టి ఆ విత్తనాలను పొడి చేయండి. ఈ చూర్ణం డయాబెటిస్‌ బాధితులకు ఓ వరం. షుగర్ పేషెంట్స్ లోని అధిక రక్త చక్కెరను తగ్గించడంలో ఈ పొడి ప్రభావవంతంగా పని చేస్తుంది.

Share this post

scroll to top