బీజేపీలోకి మెగాస్టార్? ఇచ్చే పోస్టు ఇదేనా..

mega-star-18.jpg

మెగాస్టార్‌ చిరంజీవి బీజేపీకి దగ్గరవుతున్నారా! త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారా అందుకే కమలనాథులు మెగాస్టార్‌ కు రెడ్‌ కార్పేట్‌ పరుస్తున్నారా! ఇందులో భాగంగానే కిషన్‌ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకల్లో చిరంజీవి పాల్గొన్నారా! అన్ని అనుకున్నట్టు సాగితే మెగాస్టార్‌ చిరంజీవి త్వరలోనే పెద్దల సభలో అడుగుపెట్టడం ఖాయమా!

మెగాస్టార్‌ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీకి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన త్వరలోనే కషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ దఫా చర్చలు కూడా పూర్తయినట్టు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈ చర్చలను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక మెగాస్టార్‌ చిరంజీవి కమలం కండువా కప్పుకోగానే ఆయన కేంద్రంలో ఓ కీలక పదవి కూడా దక్కబోతున్నట్టు సమాచారం. మెగాస్టార్‌ను రాజ్యసభకు పంపించి పొలిటికల్‌గా మరోసారి యాక్టివ్‌ చేయాలని కాషాయ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Share this post

scroll to top