సినీ ఇండస్ట్రీ ఏపీకి రావాలి మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు..

cinima-20.jpg

ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని అన్నారు. శాసనమండలిలో ఈ రోజు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కేవలం షూటింగులు చేసి వెళ్లిపోవడం, మా దగ్గర ఆదాయం తీసుకోవడం మాత్రమే కాకుండా ఇక్కడ స్టూడియోలు నిర్మించాలని సినీ పెద్దలను కోరినట్లు తెలిపారు.

కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు, పవన్ సినీ పెద్దలతో చర్చించారని గుర్తు చేశారు. స్టూడియోలు నిర్మిస్తే ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని నిర్మాతలను కోరామన్నారు. దీనికి కొంత మంది నిర్మాతలు సుఖంగా ఉన్నారని తెలిపారు. విశాఖలో రామానాయుడు స్టూడియో ఉమ్మడి రాష్ట్రంలో 34 ఎకరాలు కేటాయించారని ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రామానాయుడు స్టూడియో భూముల్లో 15 ఎకరాలు లేఅవుట్లు వేసింది అన్నారు. ఆ 34 ఎకరాలు సినీ పరిశ్రమకు వినియోగించేలా చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని ఆయన మరోసారి చెప్పారు.

Share this post