మంత్రులతో సబ్‌ కమిటీ ఇన్సూరెన్స్ విధానంపై కీలక నిర్ణయాలు..

farmar-16.jpg

ధాన్యం సేకరణ బకాయిలు చెల్లింపులకు రూ. 2 వేల కోట్ల మేర రుణం తీసుకోవాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే వచ్చే సీజన్లో ధాన్యం సేకరణ నిమిత్తం రూ. 3200 కోట్ల రుణానికి బ్యాంక్ గ్యారెంటీలిచ్చామన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన క్రాప్ ఇన్సూరెన్స్ వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని.. క్రాప్ ఇన్సూరెన్స్ విధానంపై ఫైనాన్స్, సివిల్ సప్లైస్, వ్యవసాయ శాఖ మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేశారని చెప్పారు. నెల రోజుల్లో సబ్ కమిటీ నివేదికివ్వాలని కేబినెట్ సూచించినట్లు తెలిపారు. కౌలు రైతుల మేలు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కౌలు రైతులకు సరైన సాయం.. రుణాలు అందడం లేదన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులను ఇవ్వడం ద్వారా సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తామన్నారు. కౌలు రైతుల సమస్యలపై అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

Share this post

scroll to top