తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అక్రమాల మేత మేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, అందుకోసం మంత్రికి ముడుపులు చెల్లిస్తున్నారని చెప్పారు. పెద్దఎత్తున కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. ఈ విషయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమేనన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. విద్యార్థి నాయకుడిగా, ఎంపీగా ఆనాడు పార్లమెంట్‌లో తెలంగాణ కోసం కొట్లాడాను అని పొన్నం తెలిపారు. తన గొంతు ప్రతిపక్షాలకు మంచిగా అనిపియకుంటే తానేం చేయాలే అంటూ మంత్రి సీరియస్ అయ్యారు. ప్రతిపక్షాలు ఆడుమంటే ఆడే, పాడుమంటే పాడే గొంతు తనది కాదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పార్టీ అధికారంలో ఉన్నా ఇలానే మాట్లాడాను అని పొన్నం ప్రభాకర్ అన్నారు. అవసరం ఉంటే రికార్డులు తెప్పించుకుని చూడాలన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమే..
