బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. శనివారం ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్ లో కేసీఆర్‌ను స్వయంగా కలిసి సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానించారు. మంత్రి పొన్నంతో పాటు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావులు ఉన్నారు. కేసీఆర్‌తో పాటు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు ఆహ్వానాలు పంపుతామని మంత్రి పొన్నం ప్రకటించారు.