డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో ఓ మైనర్ బాలికకి మద్యం తాగించి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కాకినాడ జిల్లా ఇందిరానగర్ మాజీ కౌన్సిలర్ భర్త జాన్ బాబు. మైనర్ బాలికకు మద్యం తాగించి ఆపై అత్యాచారం చేశాడు. ఈ వ్యవహారంలో ఓ మహిళ కూడా అతడికి సహాయం చేసినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం రాత్రి బలవంతంగా ఆటో ఎక్కించి డంపింగ్ యార్డ్ దగ్గరికి తీసుకెళ్ళిన మాజీ కౌన్సిలర్ అక్కడే ఆమెకి బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. వారి కంప్లైంట్‌తో నిందితుడైన జాన్ బాబుతో పాటు మరో మహిళని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అపస్మారక స్థితిలో ఉన్న బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె కాన్షియస్‌లోకి వస్తే మరిన్ని నిజాలు బయటపడే ఛాన్స్ కనిపిస్తోంది.
బాలికతో మద్యం తాగించి అత్యాచారం..
