మత్స్యశాఖను చూస్తే బాధనిపిస్తోంది..

acham-naidu-10.jpg

మత్స్యశాఖ దుస్థితి చూస్తే చాలా బాధగా అనిపించిందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుఅన్నారు. బుధవారం జాతీయ మత్స్యశాఖ దినోత్సవరం సందర్భంగా మత్స్యకారుల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటి సారిగా రివ్యూ నిర్వహించానని తెలిపారు. అత్యంత సుదీర్ఘ సాగరతీరం ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖ ఉందా అనే విధంగా తయారు చేశారని మండిపడ్డారు. నాలుగు హార్భర్లు ఉన్నాయని.. అందులో రెండు పని చేస్తున్నాయి, రెండు పని చేయటం లేదన్నారు. హార్భర్లు ఎక్కువగా ఉంటే మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందని తెలిపారు. హార్భర్స్ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయన్నారు.

Share this post

scroll to top