చార్మినార్ వద్ద అందాల సుందరీమణులు..

hyd-13.jpg

4 ప్రత్యేక బస్సుల్లో చార్మినార్‌ వద్దకు సుందరీమణులు చేరుకోనున్నారు. ఆలా చేరుకున్న వారికి పాతబస్తీ ఏరియా ప్రసిద్ధ మార్ఫా వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఆ తర్వాత చార్మినార్‌ వద్ద ప్రత్యేక ఫోటో షూట్‌ను కూడా నిర్వహించబోతున్నారు. అంతేకాక, చార్మినార్‌ సమీపంలోని చుడీ బజార్‌లో ఎంపిక చేసిన తొమ్మిది ప్రముఖ దుకాణాల్లో ఈ సుందరీమణులు షాపింగ్ చేయబోతున్నారు. గాజులు, ముత్యాల హారాలు, ఇంకా అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడమే కాక అక్కడే గాజులు తయారీ విధానాన్ని కూడా స్వయంగా సుందరీమణులు పరిశీలించనున్నారు.

ఈ కార్యక్రమం తర్వాత మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్‌ చౌమల్లా ప్యాలెస్‌లో జరిగే ప్రత్యేక విందుకు హాజరు కానున్నారు. అక్కడ వారికోసం మెహందీ కార్యక్రమం, నిజామీ సాంప్రదాయ దుస్తులు ధరించే ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. ఆపై తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపే డాక్యుమెంటరీ సినిమాలను కూడా వీరికి చూపించనున్నారు. ఇక చివరగా చౌమల్లా ప్యాలెస్‌లో ప్రత్యేకంగా వెల్‌కమ్ డిన్నర్‌ ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా చార్మినార్ జోన్ పరిధిలో ట్రాఫిక్‌ను మళ్లించేందుకు పోలీస్ శాఖ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా మిస్ వరల్డ్ పోటీదారులకు హైదరాబాద్‌ సంస్కృతి, సంప్రదాయం, ఆతిథ్యాన్ని చూపించే అవకాశంగా భావిస్తున్నారు నిర్వాహకులు.

Share this post

scroll to top