మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యారని సమాచారం. దీంతో ఆయన్ను వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. మిజోరం గవర్నర్ హరిబాబును ఆస్పత్రికి తరలించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు ఎమర్జెన్సీగా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశారని సమాచారం. హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. హరిబాబు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు అస్వస్థత..
