ఏపీ అసెంబ్లీకి భారీగా తగ్గుతోన్న ఎమ్మెల్యేల హాజరుశాతం..

ap-asmble-11.jpg

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే, అసెంబ్లీ ప్రారంభమైన తొలి రోజు సభకు హాజరైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు గవర్నర్‌ ప్రసంగిస్తుండగానే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగం కొనసాగుతుండగానే అసెంబ్లీ సమావేశాలను వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు. ఇక, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను మినహాయిస్తే సభలో 164 మంది సభ్యులు ఉండాలి. కానీ, అసెంబ్లీలో ఎమ్మెల్యేల హాజరు శాతం భారీగా తగ్గిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నా అసెంబ్లీకి రావడం లేదు ఎమ్మెల్యేలు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్నటు వరకు బిజీగా ఉన్నారని భావించినా ఆ తర్వాత కూడా హాజరు శాతం తగ్గింది ఒక్కోసారి 60 మంది సభ్యులు కూడా లేకుండా సభ నడుస్తోంది.

Share this post

scroll to top