దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య విభేదాలపై MLA చింతమనేని ప్రభాకర్ స్పందించారు. శుక్రవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. కొన్ని అరాచక శక్తులు ఇటీవలే జనసేనలో చేరాయని కీలక ఆరోపణలు చేరారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే వాళ్లు పార్టీలో చేరారని ఆరోపించారు. చేరినవాళ్లు చేరినట్టు ఉంటే మంచిది. పెన్షన్ల పంపిణీతో వాళ్లకు సంబంధమేంటి? అని ప్రశ్నించారు. గ్రామాల్లో గొడవలు పెట్టే సంస్కృతి మానుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు కూటమి ఓటమికి ప్రయత్నించింది కూడా వారే అని అన్నారు. ఇప్పుడు పార్టీలో చేరి అధికారం చెలాయిస్తామంటే కుదరదు.
చింతమనేని జనసేనపై కీలక ఆరోపణలు..
