ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందు వర్చువల్ గా హాజరుకానున్నారు. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటుపై న్యాయమూర్తి కావేరీ బవేజా విచారణ చేపట్టనున్నారు. గత విచారణలో నిందితులకు సీబీఐ ఇచ్చిన చార్జిషీటు కాపీలు సరిగా లేవని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తమకు అందజేసిన చార్జిషీటు కాపీల్లో చాలా పేజీలు ఖాళీగా ఉన్నాయని కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు కోర్టుకు తెలిపారు. సరైన పత్రాలను అందించాలని రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.
నేడు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణ..
