బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు బయల్దేరారు. గురువారం ఉదయం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం నుంచి కార్యకర్తలను, అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కీలక విజ్ఞప్తి చేశారు. 10 రోజుల పాటు ఎర్రవెల్లిలోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పది రోజుల పాటు తనకు సహకరించాలని దయచేసి తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని రిక్వెస్ట్ చేశారు. 10 రోజుల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని సహకరించాలని కోరారు. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ కానున్నారు.
10 రోజుల తర్వాత అందరికీ అందుబాటులోకి..
