తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటివరకు 20 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు నేడు గుంటూరు కలెక్టరేట్‌లో పీడీఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లక్ష్మణరావు నామినేషన్ వేయనున్నారు. ఇక రేపు నామినేషన్లు పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. ఈనెల 13వ తేదీ వరకు ఉపసంహరణకు గడువునిచ్చింది ఈసీ. ఈనెల 27వ తేదీన పోలింగ్ జరగనుండగా మార్చి 3న కౌంటింగ్ చేస్తారు. అయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 3 లక్షల 15 వేల 267 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. దీంతో 440 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది ఈసీ.
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు గడువు..
