వైసిపి పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల వైసిపి పార్టీని వీడిన ఇద్దరు కీలక లీడర్లు టిడిపి పార్టీలోకి వెళ్లడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో మోపిదేవి వెంకటరమణ అలాగే మస్తాన్రావు చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 29వ తేదీన వైసీపీ పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ అలాగే బీద మస్తాన్రావు రాజీనామా చేయడం జరిగింది. అయితే వైసీపీకి రాజీనామా చేసిన ఈ ఇద్దరు లీడర్లు రేపు టిడిపిలో చేరబోతున్నారు. ఉండవల్లి లోని నారా చంద్రబాబు నాయుడు నివాసంలో పసుపు కండువాలు కప్పుకొని టిడిపిలో చేరబోతున్నారు.
రేపు టీడీపీలో చేరనున్న మస్తాన్‌రావు, మోపిదేవి..
