విలువలు విశ్వసనీయత లేని రాజకీయాలకు అర్థం లేదు..

ys-jagan-18.jpg

నాలుగు నెలల్లో ఇంతటి అధ్వాన్నమైన పాలన ఎప్పుడూ చూసి ఉండ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ఇలాంటి సమయంలో మనం చేసిన మంచి పనులను ప్రజలు గుర్తిస్తారని చెప్పారు. అధికారం ఈరోజు ఉండొచ్చు లేకపోవచ్చు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలన్నారు. అధికారం కోసం చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేవ‌న్నారు. వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ నేతలతో వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరయ్యారు. 

Share this post

scroll to top