నేను శామీర్‌పేటలోనే ఉంటున్నా.. ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా..

etala-20.jpg

నేను శామీర్‌పేటలోనే ఉంటున్నా.. మీకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా’ అని ఎంపీ ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ఈ మేర కు బుధవారం కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌లోని మేడక కోటేశ్వరరావు, వాణిశ్రీ ఇంట్లో తేనేటీ విందుకు హాజరయ్యారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. ఎన్నికల్లో కష్టపడి పని చేయడమే కాదు.. గెలిపించి మరింత బాధ్యత పెంచారన్నారు. ఈ సందర్భంగా ఈటలను శాలువాతో సత్కరించారు. ఎంపీని కలవడానికి వచ్చిన అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఫొటోలు దిగారు.

Share this post

scroll to top