రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసకర రాక్షస పాలన..

sai-redy-29.jpg

ఆంధ్ర ప్రదేశ్ మద్యాంధ్రప్రదేశ్‌ గా మారింది అని వైసీపీ రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసకర రాక్షస పాలన కొనసాగుతోందని ఫైర్ అయ్యారు. జగన్ గారు గత ఐదేళ్ల పాలనా కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలబెట్టారన్నారు. ముఖ్యంగా నాడు రాష్ట్రాన్ని ‘హరిత ఆంధ్రప్రదేశ్ గా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా విద్యా ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దితే నేడు ఈ టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌ గా మద్యాంధ్రప్రదేశ్‌ గా అనారోగ్యాంధ్రప్రదేశ్‌ గా మార్చేస్తున్నారు అంటావు ట్వీట్ చేశారు.

చంద్రబాబు సంపద సృష్టి లో భాగంగా గ్రామాల్లో మద్యం దుకాణాల కోసం జనాభా ప్రాతిపదికన ధర నిర్ణయం చేస్తున్నారని చెప్పారు. అధిక మొత్తం వెచ్చించి మద్యం దుకాణాలను దక్కించుకున్న టిడిపి సిండికేట్ వ్యాపారులు గ్రామాలలో బెల్ట్ షాపులు లైసెన్స్ ఇచ్చేస్తున్నారు. బెల్ట్ షాపులు కోసం జనాభా మద్యం విక్రయాల స్థాయిని బట్టి రెండు లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారన్నారు.

Share this post

scroll to top