కేతిరెడ్డిని తాడిపత్రి, అనంతపురం, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచే బహిష్కరించాలని కోరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులను కూడా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫ్యాక్షన్ చేస్తా అని గతంలో మాట్లాడాడు. మాకు ప్రాణాహని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. కేతిరెడ్డి జీవితం గన్‌మెన్‌ల తోనే సాగిందన్న ఆయన పోలింగ్ రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి తమ కార్యకర్త సూర్యముని ఇంటిపై దాడి చేశారని తెలిపారు. ఇక, గతంలో ఐఏఎస్, ఐపీఎస్ లు ఏపీని సర్వనాశనం చేశారని విమర్శించారు. ఆ అధికారులు ఇప్పుడు లా గురించి మాట్లాడతారా? అని ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో అల్లర్ల కేసులో నన్ను అరెస్ట్ చేసుకోండి అని వ్యాఖ్యానించారు. మరోవైపు.. తన ట్రావెల్స్ పై, తనపై పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి డీటీసీ, ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఈ నెల 24న అనంతపురం వన్ టౌన్ లో ఫిర్యాదు చేయబోతున్నాను అన్నారు. పేర్ని నాని, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, డీటీసీలపై ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.