అక్కినేని ఇంట పెళ్లి బాజా మోగింది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహబంధంలోకి అడుగుపెట్టారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి, హీరో కార్తి, రామ్‌చరణ్, రానా, నాని, కీరవాణితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను అన్నపూర్ణ స్టూడియోస్ ఎక్స్ వేదికగా తాజాగా పంచుకుంది.
ఘనంగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం..
