ఈజీ మనీ కోసం ముఠాగా ఏర్పడ్డారు. తమకున్న అనుభవంతో గతంలో పనిచేసిన సంస్థకే కన్నం వేశారు. అయితే ఈ ముఠాలోని సభ్యుడు చేసిన చిన్న దొంగతనంతో గుట్టురట్టయి చివరికి కటకటాల పాలయ్యారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాకు చెందిన ధీరావత్ నగేశ్, ధీరావత్ చిరంజీవి , ధరావత్ మురళి, పానుగోతు సుమన్, ధీరావత్ నవీన్లు గతంలో కొత్త సెల్ టవర్ల నిర్మాణం, మెయింటనెన్స్ కంపెనీల్లో పని చేసి మానేశారు. జల్సాలకు అలవాటు పడిన వీరంతా ముఠాగా ఏర్పడి ఈజీ మనీ కోసం పథకం వేశారు. తమకున్న అనుభవంతో గతంలో పనిచేసిన కంపెనీకే కన్నం వేశారు. నిర్మానుష్య ప్రదేశాల్లో ఉన్న ఎయిర్ టెల్ సెల్ ఫోన్ టవర్లను టార్గెట్ చేసుకొని, అందులోని 5జీ రేడియో రిమోట్ యూనిట్లను అపహరించారు.
చోరీల్లో వీరి స్టైలే వేరు.. అన్నం పెట్టిన కంపెనీకి కన్నం వేసిన మాజీ ఉద్యోగులు..
