నిరుద్యోగులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ పండుగలాంటి వార్తను నారా లోకేష్ ప్రకటించారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు.
మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, నవ్యాంధ్రలోనూ 80 శాతంపైగా టీచర్ల నియామకం చేసింది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామని ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ ఉంటోందని పేర్కొన్నారు.