ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నారాయణ ఘాటు వ్యాఖ్యలు..

narayana-27.jpg

సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సీపీఐ జాతీయ కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షో విషయంలో నాగార్జున తీరును నారాయణ అప్పుడప్పుడూ తప్పు బడుతుంటారు. సమాజాన్ని చెడగొట్టేలా బిగ్ బాస్ షో ఉందంటూ ఆరోపణలు చేస్తుంటారు. తాజాగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నారాయణ స్పందించారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీపీఐ నారాయణ హీరో నాగార్జునపై కీలక వ్యాఖ్యలు చేశారు. నాగార్జునకు ఎందుకింత కక్కుర్తి అంటూ నారాయణ మండిపడ్డారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని నారాయణ చెప్పారు. పేద ప్రజలు గజం స్థలం ఆక్రమిస్తే రాద్ధాంతం చేస్తారని ఇక్కడేమే ఏకంగా చెరువులను కబ్జాచేశారంటూ విమర్శలు గుప్పించారు. నాగార్జున సత్యహరిశ్చంద్రుడేమీ కాదన్న నారాయణ కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారని ఆరోపించారు. ఎన్ కన్వెన్షన్ మీద ఇన్నిరోజులూ సంపాదించింది వసూలు చేయాలని డిమాండ్ చేశారు.

Share this post

scroll to top