యానిమల్ ఘన విజయంతో బీటౌన్‌ లో రష్మికు వరుస అవకాశాలు..

rashmika-24.jpg

బాలీవుడ్‌లోనూ అవకాశాలు చేజిక్కించుకుని నేషనల్ క్రష్‌ గా మారారు రష్మిక మందన్నా. గతేడాది సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్ కాంబినేషన్‌ లో తెరకెక్కిన యానిమల్ లో రష్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయే భర్తను అర్ధం చేసుకుంటూ, కుటుంబాన్ని చక్కదిద్దే ఇల్లాలిగా ఆమె అద్భుతంగా నటించారు. ఈ మూవీలో కొన్ని బోల్డ్ సీన్స్‌ లో నటించినప్పటికీ నటిగానూ మంచి మార్కులు పొందారు. యానిమల్ ఘన విజయంతో బీటౌన్‌ లో రష్మికు వరుస అవకాశాలు క్యూకడుతున్నాయి. అయితే ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటూ, మంచి క్యారెక్టర్లకు ఓకే చెబుతున్నారు శ్రీవల్లి.

ప్రస్తుతం బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ – తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సికందర్’లో ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఏకంగా కండలవీరుడితో రొమాన్స్ చేసే అవకాశం రావడంతో ఆమె గాల్లో తేలుతున్నారు. దీనితో పాటు రైన్ బో, గర్ల్‌ఫ్రెండ్ అనే రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ రష్మిక నటించనున్నారు.

Share this post

scroll to top