నయనతార కోసం తగ్గేదేలే..

mega-03.jpg

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవితో ఒక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ సిద్ధం చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. చాలామంది బాలీవుడ్ హీరోయిన్‌లను కూడా ఈ సినిమాలో నటింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ, చివరిగా నయనతారను టీమ్ ఫిక్స్ చేసింది.

అనిల్ రావిపూడి నయనతారను ప్రపోజ్ చేయగా, మెగాస్టార్ చిరంజీవి కూడా అందుకు ఒప్పుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నయనతార కలిసి గతంలో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు చేశారు. ఈ సినిమాకు నయనతార 18 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది ఇచ్చేందుకు సైతం నిర్మాతలు రెడీగా ఉన్నారని అంటున్నారు. ఎందుకంటే, నయనతారకు ఇతర భాషల్లో మంచి మార్కెట్ ఉంది, తెలుగులో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాను మార్కెట్ దృష్ట్యా ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయవచ్చనే ఆలోచనలతో మేకర్స్ ఆమెకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాస్త అటూ ఇటూ అయినా సరే, ఆమెనే ఫైనల్ చేసి షూట్‌కి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రాన్ని సాహూ గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి అనిల్ రావిపూడి ఎంతో కేర్ తీసుకుంటున్నాడు.

Share this post

scroll to top