భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తయ్యేది అప్పుడే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..

bogapuram-10.jpg

భోగాపురం ఎయిర్‌పోర్ట్.. ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘ కల. దీనిని సాకారం చేసి తీరుతామంటోంది ఎన్డీయే సర్కార్. ఈ ఎయిర్‌పోర్ట్ ఎప్పటిలోపు పూర్తి చేయాలనే దానిపై డెడ్‌లైన్ కూడా పెట్టుకున్నారు కేంద్రమంత్రి రామానాయుడు. పౌరవిమానయాన మంత్రిగా కింజారపు రామ్మోహన్ ఉండటంతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై ఉత్తరాంధ్రవాసులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అతి త్వరలోనే ఈ ఎయిర్‌పోర్ట్ పూర్తై అందుబాటులోకి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. వారి అంచనాలకు తగినట్టుగానే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్‌పోర్ట్‌ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన రామ్మోహన్.. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలన్నారు.

Share this post

scroll to top