వేమిరెడ్డిని పట్టించుకునే నేతలే కరువయ్యారు..

vemi-reddy-07.jpg

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో గత దశాబ్దకాలంగా చక్రం తిప్పుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటినుంచి వైసీపీలో కొనసాగుతూ పార్టీకి అండదండ జిల్లాలో తానే అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉండగా పార్టీ కార్యక్రమాలు అన్నిటికీ తనవంతు సహకారం అందించి ఆర్థికమగా అండగా నిలిచారు. అటువంటి నేతను పట్టించుకోలేదన్న విమర్శలు 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికమయ్యాయి. వాటిని నిజం చేస్తూ ఆయన చెప్పిన వారికి కాదని నెల్లూరు నగర ఎమ్మెల్యే టికెట్ ని జగన్ మరొకరికి కట్టబెట్టారు. దీంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురై పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఆర్థికంగా వెన్నుదన్ను ఉన్న వేమిరెడ్డి లాంటి నేత పార్టీలో చేరడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపింది. ఆయన చేరికతో మాజీ ఎమ్మెల్యేలు నేతలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఘనంగా పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పి శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత పరిస్థితుల్లో కొద్ది కొద్దిగా మార్పు వచ్చింది. పార్టీ అధికారంలోకి రాగానే కొద్దిరోజుల పాటు ఆనందంతో శుభాకాంక్షలు చెప్పిన నేతలు ఆ తర్వాత క్రమేపి ఆయనను కలవడం ఆపేశారట. తనకు కేటాయించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన వంతు భావించిన ఆయన ఇప్పుడు వ్యాపారాలలో కాస్త బిజీ అయ్యారట. అయితే ఇప్పుడు నేతల తీరులో కూడా మార్పు వచ్చిందని వేమిరెడ్డిని పట్టించుకునే నేతలే కరువయ్యారని జోరుగా చర్చ జరుగుతుంది.

Share this post

scroll to top