సరిపోదా శనివారం హ్యాట్రిక్ అంటూ అనుకున్నట్టుగానే ప్రీమియర్స్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ రిపోర్ట్స్ వస్తున్నాయి. క్లీన్ సినిమా అని ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా ఊహించలేదు. అని ఓ యూజర్ రాసుకొచ్చాడు. వివేక్ ఆత్రేయకు సక్సెస్ పడినట్టే. ప్రతీ ఒక్కరి కష్టం ఫలించింది. అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఫస్ట్ హాఫ్ చెప్పుకునేంతగా లేదు. కొన్ని సన్నివేశాలు నెట్టుకొచ్చాయి. కేవలం సెకండాఫ్ సినిమాను సేఫ్ జోన్‌లో ఉంచుతుందని మరో నెటిజన్ పేర్కొన్నాడు. సరిపోదా శనివారం బ్లాక్ బస్టర్. జేక్స్ బిజోయ్ అదిరిపోయే బీజీఎంతో అదరగొట్టేశాడని నాని అభిమాని ట్వీట్ పెట్టాడు.
సెకండాఫ్ డైరెక్షన్ అద్బుతం నాని, ఎస్‌జే సూర్య ఇరగదీశారు. ఎజేసూర్య కామెడీ టైమింగ్ అదిరింది. జేక్స్ బిజోయ్ బీజీఎం పీక్స్‌లో ఉంటుంది. పక్కా కమర్షియల్ మూవీ తీశాడని ఓ యూజర్ రాశాడు. ఫస్ట్ హాఫ్ లెంగ్తీగా బోరింగ్ కథనంతో సాగుతుంది. ఇంటర్వెల్ ఫైట్ బీజీఎం అద్భుతమని ఓ నెటిజన్ అంటే.. వివేక్ ఆత్రేయ రిపీట్ ఫీల్ రాకుండా ఈ సారి కథనాన్ని బాగా రాసుకున్నాడని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.