పవన్ తనయుడు అకిరా నందన్ ఇటీవల రెగ్యులర్ గా బయట కనిపిస్తూ వైరల్ అవుతున్నాడు. పవన్ సినిమాలకు థియేటర్స్ లో హడావిడి చేస్తున్నాడు. పవన్ ఎన్నికల్లో గెలిచాక నాన్నతో పాటే తిరిగాడు. అకిరా నందన్ హీరో అవుతాడని, సినిమాల్లోకి వస్తాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
తాజాగా నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు ఓటీటీ రిలీజ్ మీట్ పెట్టగా ఈ ప్రెస్ మీట్ లో నిహారికకు అకిరా గురించి ప్రశ్న ఎదురయింది. ఓ మీడియా ప్రతినిధి చాలా మంది కొత్తవాళ్లను సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు, మీ తమ్ముడు అకిరాను పరిచయం చేసే ఉద్దేశం ఉందా అని అడగ్గా నిహారిక సమాధానమిస్తూ ఇంకా అతను చాలా యంగ్. అసలు అకిరాకి ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన ఉందా అని కూడా నేను ఎప్పుడూ అడగలేదు. అతను సినిమాల్లోకి వస్తాడో రాడో నాకు తెలీదు అని తెలిపింది.