మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ట్విట్టర్ లో తెగ ట్రెండ్ అవుతున్నారు. అందుకు కారణం ఓ సెన్సేషనల్ డైరెక్టర్ తో కలిసి తారక్ కనిపించడమే. అతను మరెవరో కాదు గత ఏడాది ‘యానిమల్’ తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగా. ఈ క్రేజీ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సందీప్ రెడ్డి వంగా, తారక్ చర్చించుకుంటున్న స్టిల్ చూసిన మూవీ లవర్స్ ఏంటీ ఈ ఇద్దరు సినిమాకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ క్రేజీ స్టార్స్ కలుసుకోవడం వెనుక సీక్రెట్ ఏమీ లేదని ఇద్దరిదీ కేవలం సరదా డిస్కషన్ మాత్రమేనని ఇన్‌సైడ్ టాక్.
ఎన్టీఆర్ తో సందీప్ రెడ్డి వంగా..
